అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ…‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక మంచి…