చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం : హీరోయిన్ కీర్తి సురేష్

I am lucky to act with Chiranjeevi : Heroine Keerthy Suresh

‘భోళా శంకర్’లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ గారికి సిస్టర్ గా నటించారు. ఇప్పుడు భోళా శంకర్ లో చిరంజీవిగారికి సిస్టర్ గా కనిపించడం ఎలా అనిపించింది ? చాలా ఆనందంగా వుంది.…