జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా..ఎజెండా : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ

HUJ Elections

తమకు ఎలాంటి రాజకీయాలు లేవని, పోరాటాలే తమ ఊపిరి, జర్నలిస్టుల సంక్షేమమే జెండా, ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ హాలులో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూ జే) ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ గా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటుందని విరాహత్ అన్నారు. ఇవ్వాళ జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటాల ఫలితంగా సాధించినవేనన్నారు. కొన్ని శక్తులు వారి స్వప్రయోజనాల కోసం…