యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’తో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు? ప్రివ్యూస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? ప్రివ్యూస్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నవ్వించాలని ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఫ్యామిలీ, యూత్ కి చాలా నచ్చుతుంది. ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకులు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్…