ఏ యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో హీరో శ్రీకాంత్, కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా పోసాని కృష్ణమురళి,మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోతల రాయుడు’. ఫిబ్రవరి 4న థియేటర్స్ లలో విడుదలై ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ సినిమా ఇప్పడు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడడమే కాక మాకు ఎంతో పేరు…