హృదయాన్ని హత్తుకునేలా ‘శశివదనే’ టీజర్.. ఆకట్టుకుంటోన్నరక్షిత్ అట్లూరి, కోమలీ పెర్ఫామెన్సెస్

Heart touching 'Sasivadane' teaser.. Rakshit Atluri, Komali performances

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ‘శశివదనే’ సినిమా టీజర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. హీరో (రక్షిత్ అట్లూరి), హీరోయిన్ (కోమలీ ) కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న…