బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే…