హ్యాపీబర్త్ డే నయన్‌.. శుభాకాంక్షల వెల్లువ!

Happy birthday Nayan.. Best wishes!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భర్త విఘ్నేష్‌ శివన్‌ కూడా నయన్‌కి స్పెషల్‌గా విషెస్‌ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే నయనతార. లవ్‌ యూ మై ఉయిర్‌, ఉలగం. నా జీవితం యొక్క అందం, అర్థం మీరు.. మీ సంతోషమే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్‌,…