మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి. రమేష్ బాబు అనగానే…