సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం

general news in hyderabad

– మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య – భాగ్యనగరం లో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం లోకి రావలసిన అవసరం ఉందని, యువత ను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో వున్న కచ్చి భవన్ లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజాల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య…