ఢిల్లీ లో జరగనున్న నిరసనలకు సంపూర్ణ మద్దతు

Full support for the protests in Delhi

బిసి రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొని విజయవంతం చేస్తాం ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల ఐక్యవేదిక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల జేఏసీ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు దేవరకొండ సైదులు, కిరణ్ కుమార్, సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈనెల 5 6 7 తేదీలలో జరగనున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు.…