పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ నుండి ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా విడుదల

First glimpses of Pawan Kalyan's action entertainer Ozzy release Hungry Cheetah

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ కోసం దర్శకుడు సుజీత్ తో చేతులు కలిపారు. ఆస్కార్ గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్‌ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రం నుండి ఈ రోజు అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేశారు. దర్శకుడు సుజీత్, స్వరకర్త ఎస్ థమన్, నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి అభిమానులతో కలిసి గ్లింప్స్ ని వీక్షించారు. పెద్ద తెరపై తమ అభిమాన హీరోని…