నేనే సరోజ : ఈ తరం ఆడపిల్ల కథ!

Eetaram Adapaillakatha : Nene Sarojua movie

యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద నిర్మిస్తున్న చిత్రం ”నేనే సరోజ” ! ఉరఫ్ కారం చాయ్ అనేది ఉప శీర్షిక. ప్రముఖ నటీనటులు సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సదానంద్ శారద మాట్లాడుతూ .. నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా చూపుతున్న వివక్షతను ఎదురిస్తూ ఎదిగిన ఈ తరం ఆడపిల్ల కథ ఇది.…