గద్దర్ అవార్డులను వివాదం చేయొద్దు : TGFDC చైర్మన్ దిల్ రాజు

Don't dispute Gaddar Awards: TGFDC Chairman Dil Raju

గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల విషయంలో విమర్శలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉగాదికి అవార్డులు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటి నుంచి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నోటిఫికేషన్ లేకుండా స్క్రీనింగ్ కమిటీ వేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి! ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గద్దర్ అవార్డుల విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. గురువారం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దయచేసి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను వివాదం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-15లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నంది సినిమా అవార్డులను సింహ అవార్డ్స్ గా మార్చి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు 10 వేల రూపాయల ఫీజు…