ప్రముఖ దర్శకుడు కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు!

Director K. Vishwantha no more

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి! ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం ‘శంకరాభరణం’. ఇది జాతీయ పురస్కారం…