హీరోగా దర్శకుడు బాబ్జీ తనయుడు!

Director Bobji's son as the hero!

తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు తీసేవారు గతంలో…..! ఆ తర్వాత హీరోలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేయడం మొదలు పెట్టారు….! ఇప్పుడు దర్శకులు ఆ బాటలో తమ కార్యాచరణ మొదలుపెట్టారు….. కాకపోతే హీరోలుగానే అని గిరి గీసుకోకుండా తమ బిడ్డలకు ఏ విభాగంలో అభిలాష ఉందో , అభినివేశం ఉందో గమనించి ఆ వైపుగా తమ వారసులను నడిపేందుకు , నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు…!! మొన్నామధ్య ఎన్ కౌంటర్ శంకర్ తన కుమారుడి చేతికి మెగా ఫోన్ ఇచ్చి అతి త్వరలో తన బిడ్డ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమవుతుందని ప్రకటిస్తే…..ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నల్లపూసలు బాబ్జీ తన కుమారుడు ” సన్నీ అఖిల్” ను హీరోగా తెలుగు తెరకు…