మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘ధమాకా’ జర్నీ ఎలా మొదలైయింది ? – వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని…