‘దేవగుడి’ ట్రైలర్ విడుదల : 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

"Devagudi" movie trailer launched Grandly, movie to have worldwide theatrical release on 30th of this month

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మీడియా మిత్రుల సమక్షంలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమా టీజర్ ను హీరో  శ్రీకాంత్ గారు రిలీజ్ చేసి సపోర్ట్ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ,…