డీప్‌ఫేక్‌ బారిన ప్రియాంకచోప్రా!

Deepfake Priyanka Chopra!

డీప్‌ఫేక్‌ వీడియోస్‌.. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్‌ వీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడమే. డీప్‌ఫేక్‌ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్‌ హీరోయిన్లు మాత్రం ఒకరి తర్వాత ఒకరు దీని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే నేషనల్‌ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా, బాలీవుడ్‌ స్టార్‌ నటులు కత్రినా కైఫ్‌, కాజోల్‌, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్‌ స్టార్‌గా పేరుపొందిన బాలీవుడ్‌ స్టార్‌ నటి ప్రియాంక చోప్రా సైతం డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. పీసీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే, ఈ సారి ఆకతాయిలు నటి ముఖం…