‘భగత్ సింగ్’ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో యాక్షన్ తో పాటు.. ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల మనసులను దోచుకొన్న ఈ చిత్రం తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఓటిటిలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను థియేటర్స్ లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా తిరిగి ఓటీటీలోకి ఎపుడు వస్తుందా? అని వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు డిసెంబర్ 2న తెరపడనుంది.…