ఇద్దరు అమ్మాయిలతో వర్మ ‘డేంజరస్’ : మూడు భాషల్లో డిసెంబర్ 9న విడుదల

debgeres movie pressmeet

కంపెనీ పతాకంపై రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా “డేంజరస్”. దీనికి “మా ఇష్టం” అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా, ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబందించిన ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మూడు భాషల్లో డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “నా సినిమాలలో మరో కొత్త కోణం ఈ సినిమా. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇద్దరు…