‘‘జీవితంలో అద్భుమైన క్షణాలు ఒక్కసారే వస్తాయి. ఆ ఫీలింగ్ గొప్పది. ఇటీవల జాతీయ అవార్డును రాష్ట్రపతితో అందుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. మరాఠీ రీమేక్ అయిన ‘మిమి’లాంటి మహిళా ప్రాధాన్య పాత్ర ‘మిమి రాథోర్’ పాత్ర దొరకటం అదృష్టం. ఇందులో సరోగసి అమ్మగా నటించా. ఆ పాత్రకోసం ఎంతో కష్టపడ్డా’’ అన్నారు కృతిసనన్. టాలీవుడ్‌లో నటిగా పరిచయమై బాలీవుడ్‌లో ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సరోగసి అమ్మగా నటించడం కోసం ఎంతో కష్టపడ్డా. ఆ సమయంలో బాగా తినేదాన్ని. ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని. యోగా, కసరత్తులు వదిలేశా. 15 కిలోలు బరువు పెరిగా. ఆ కష్టం ఊరికే పోలేదు. తగిన గుర్తింపు దక్కింది. మిర్చిమ్యూజిక్ అవార్డ్స్, ఐఫా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డు దక్కడం అరుదైన గౌరవం.…