‘దసరా’ దర్శకుడి తదుపరి చిత్రం!?

'Dasara' director's next film!?

నాని హీరోగా కెరీర్‌ లో ఫస్ట్‌ టైం ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ రోల్‌ లో నటించిన సినిమా ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల అనే ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ గా చేసిన శ్రీకాంత్‌ ఓదెల తొలి సినిమాతోనే సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నాడు. ‘దసరా’ తో సూపర్‌ హిట్‌ అందుకున్న శ్రీకాంత్‌ తన సెకండ్‌ సినిమా కూడా దసరా టైపులోనే చేస్తాడని చెబుతున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న శ్రీకాంత్‌ హీరోని ఎంపిక చేయాల్సి ఉందట. ‘దసరా’తో తన డైరెక్షన్‌ టాలెంట్‌ చూపించిన శ్రీకాంత్‌ తో చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్‌ తదుపరి సినిమాలో మెగా హీరో నటిస్తాడని టాక్‌. అఫీషియల్‌ గా ఈ సినిమా అనౌన్స్‌ మెంట్‌ త్వరలో రానుంది. హిట్‌ పడిన తర్వాత కూడా వెయిట్‌…