ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీ టీజర్

darja movie treser launch

‘కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని…