‘క్రేజీ ఫెలో’కు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : ప్రెస్ మీట్ లో ‘క్రేజీ ఫెలో’ చిత్ర యూనిట్

Crazy-Fellow-Movie-Successmeet

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో ఆది మాట్లాడుతూ.. క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. డీవోపీ…