కలర్ ఫొటో రిలీజయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్స్ హీరో నానిగారు కాల్ చేసి, సినిమా బాగా తీశాను అని అభినందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కలర్ ఫొటో సినిమాని రెండు సార్లు చూశాను అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రవితేజగారు, డైరెక్టర్ మారుతి గారు, రాజమౌళి గారు ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. కొందరు హీరోలు ఫోన్ చేసి త్వరలోనే కలుద్దాం అని చెప్పడం ఇవన్ని నాలో మరింతగా ఆత్మ విశ్వాసం పెంచుతున్నాయి. ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఏంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నేను చాలా లిమిటెడ్ క్రూతో వర్క్ చేశాను, ఫీచర్ ఫిల్మ్‌కి వచ్చేసరికి మాత్రం సెట్‌లో 80 నుంచి 100 మంది క్రూతో వర్క్…
Tag: colour photo
దసరా బరిలో.. ‘కలర్ ఫోటో’
హ్రుదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సూపర్‌హిట్ నిర్మాణసంస్థ అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై, శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇటీవల పలు చిత్రాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమృత ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు కలర్ ఫొటో చిత్రానికి కథ కూడా…