సి.ఎం. కేసీఆర్ ట్రోఫీ కప్ ను ఆవిష్కరించిన హీరో సుమన్ కరాటే క్రీడలను ప్రోత్సహించేందుకు ఈనెల 27న హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు షోటోకాన్ అకాడమీ వ్యవస్థాపకులు, ప్రముఖ నటులు సుమన్ తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం. లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీనివాస్ లతో కలిసి సి.ఎం.కేసీఆర్ ట్రోఫీ కప్పును సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాడమీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ జాతీయ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు సుమారు మూడు వేల మందికి పైగా పాల్గొంటారని, నాలుగు సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసు వరకు పోటీలను…