సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. ‘హరి హర వీరమల్లు’ గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Cinema should provide knowledge along with entertainment.. 'Hari Hara Veeramallu' is a great film: Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 23(బుధవారం) సాయంత్రం వైజాగ్ లో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను…