వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు

celebrities donates huge amount to telangana cm relief fund

మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…

‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్ వదిలిన చిరు

megastar chiranjeevi launches solo brathuke so better song

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత‌… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాయితేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సాంగ్ విడుద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేస్తూ సాయితేజ్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెష‌ల్ బ‌ర్త్‌డే చేసిన మామయ్య‌కు థాంక్స్‌. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్క‌ర్లేదు. థాంక్యూ సోమ‌చ్ మామ‌య్య‌’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత…

శోభానాయుడు లోటు తీర్చలేనిది: చిరు

chiranjeevi mourns the loss of eminent kuchipudi expert shobha naidu

ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రసంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం…