ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల చిత్రం రాబోతోంది. కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఒప్పుకున్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మంచి సినిమాను తీయగలుగుతాం. ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని…