ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అనుభూతితో పాటు, అదృష్టాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అత్యంత అరుదైన చిత్రమే ‘డియర్ కృష్ణ’. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడమే కాదు, లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది ఈ చిత్రం. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి…