Permanent expulsion from the Dance Directors Association? Famous Tollywood choreographer Johnny Master, who was arrested in a sexual harassment case and released on bail, got a big shock. It is known that Johnny has been permanently removed from the Dancer and Dance Directors Association. Johnny Master continued as the president of the Dancer Association until allegations of sexual harassment were made against him. It is reported that the association decided to remove him from the post only when allegations of sexual harassment of an assistant choreographer were made. In this…
Tag: Big shock for Tollywood choreographer Johnny Master!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ !
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. జానీను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తుంది. తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రానంతవరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో అప్పుడే ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి. ఇక కొత్త పాలక వర్గం ఎన్నుకున్న అనంతరం జానీని ఈ అసోసియేషన్‌ను తొలగించారని తెలుస్తుంది.