విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిచ్చగాడు -2’. ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం వల్ల ‘బిచ్చగాడు -2’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన కావ్యథాపర్ హీరోయిన్గా నటించింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? ‘బిచ్చగాడు -2’తో దర్శకుడిగా, హీరోగా విజయ్ ఆంటోనీకి విజయం దక్కిందా? లేదా? అన్నది తెలుసుసుందాం… కథలోకి… లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ). ఎంతో గొప్ప పేరున్న గురుమూర్తి దేశంలోనే రిచెస్ట్ బిజినెస్‌మెన్స్‌లో ఒకరిగా చెలామణి అవుతుంటాడు. అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతాడు అతడి స్నేహితుడు అరవింద్(దేవ్‌గిల్). అంతటితో ఆగక..విజయ్ గురుమూర్తి…