(చిత్రం : భోళా శంకర్, విడుదల : 11 ఆగస్టు- 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : మెహర్ రమేష్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్). మెగాస్టార్ సినిమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక మెగా అభిమానులు అయితే థియేటర్లో వద్ద చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి రికార్డులు కొల్లగొట్టాడు. బాక్సాఫీస్…