(చిత్రం : భగవంత్ కేసరి, విడుదల : 19, అక్టోబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్ పాల్ తదితరులు. దర్శకత్వం : అనిల్ రావిపూడి, సంగీత: తమన్, సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విజయాలతో సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్నారు స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఊపులో తాజాగా ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణకు తన కెరీర్…