‘బెదరులంక 2012’ విజయం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది : సక్సెస్ మీట్‌లో హీరో కార్తికేయ

'Bedarulanka 2012' success gave me confidence: Hero Karthikeya at success meet

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.  హీరో కార్తికేయ మాట్లాడుతూ ”మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు… సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే… ‘బెదరులంక 2012’ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు…