సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందుకే డెబ్యూ డైరెక్టర్లు ఇలాంటి కథ.. కథనాలతో మూవీస్ ని తెరకెక్కిస్తూ… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా లెక్కలోకి తీసుకుని… బుల్లితెరపైనా విజయం అందుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘అశ్విన్స్’ ఇలాంటి జోనర్ లో తెరకెక్కిందే. ‘తారామణి’ ఫేం వసంత్ రవి… మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తమ చిత్రాన్ని కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలంటూ… ఇందులో ఎంత హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో… ఒక రకంగా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు…