‘అమిగోస్’ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌టం ల‌క్కీగా ఫీల్ అవుతున్నా: శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్‌

ashikaranganadh interview abour AMIGOS Movie

– ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాలి.. – క‌ళ్యాణ్ రామ్ డెడికేషన్ చూసి ఫిదా అయ్యా.. టాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌కి వ‌ర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్ద‌గా తేడా లేదు. భాష మాత్ర‌మే వ్య‌త్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందు కెళ‌తారు’’ అని అంటున్నారు హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్‌. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులో న‌టిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్’. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అమిగోస్ సినిమా జ‌ర్నీ ఎలా మొద‌లైంద‌నే విష‌యంతో…