తెరంగేట్రం చేస్తున్న అర్జున్‌ రెండో కూతురు!

Arjun's second daughter who is making her debut!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే నటిగా తమిళ..కన్నడలో నాలుగైదు సినిమాలు చేసింది. టాలీవుడ్‌ లో కూడా ఆ మధ్య ఓ సినిమా లాంచే చేసారు. అందులో విశ్వక్‌ సేన్‌ హీరో. కానీ హీరోతో వివాదం కారణంగా అర్జున్‌ ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసారు. అయితే నటిగా మాత్రం సక్సెస్‌ కాలేదు. ఐశ్వర్య సినిమాలు చేసి నాలుగేళ్లు దాటింది . చివరిగా 2018లో మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇదే ఏడాది తెలుగు సినిమా లాంచ్‌ అవ్వడం..ఆగిపోవడం అన్ని నెల రోజుల్లోనే జరిగిపోయాయి. అయితే ఇంతలోనే ఐశ్వర్య వివాహం చేసుకుంటుందని వార్తలొచ్చాయి. సినిమాలకు గుడ్‌ బై చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రచారం సాగింది. ఇంతలోనే అర్జున్‌ రెండవ కుమార్తె అంజన కూడా తెరంగేట్రం చేస్తుందన్న వార్త టాలీవుడ్‌…