యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగుతెరకు పరిచయం చేస్తూ విశ్వక్‌సేన్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో విశ్వక్‌సేన్ తనను, తన యూనిట్ ని అనేక ఇబ్బందులకు గురిచేశాడని, షూటింగ్ కు అంతరాయం కలిగించాడని అర్జున్ శనివారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో విశ్వక్‌సేన్ పై తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ .. ” కొన్నివెబ్ సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకు ఏమాత్రం తెలీదు. నా కూతురు ఐశ్వర్యను తెలుగు చిత్ర సీమ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నా స్టొరీ విశ్వక్ సేన్ కి…