ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ విడుదల

Arjun Ambati's 'Paramapada Sopanam' teaser released with grandeur

‘పరమపద సోపానం’ మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా…