‘యానిమల్‌’తో ప్రశంసలు ..విమర్శలూ ఎదుర్కొన్నా : తృప్తి డిమ్రి

Appreciation with 'Animal'

‘యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్ననటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి. తన తదుపరి చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్‌’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఆ సినిమా వల్ల ఫేమ్‌ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అన్నారు. ‘యానిమల్‌’ సినిమా విడుదలయ్యాక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. జోయాగా యాక్ట్‌ చేసినందుకు నన్ను చాలామంది తిట్టారు. సోషల్‌విూడియా వేదికగా పలువురు నెటిజన్లు అసభ్యంగా ట్రోల్‌ చేశారు. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో బాధపడ్డా. మానసికంగా ఆవేదనకు గురయ్యా. దానినుంచి బయటకు రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నా.…