‘బంగార్రాజు’ ఆల్బ‌మ్ మా అంచ‌నాల‌ను అందుకుంది : సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌

anuprubens interview

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగార్జున‌ గారు ఒక పాట‌ను ఆల‌పించారు. ఈ పాట‌ల‌కు సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ సంద‌ర్భంగా అనూప్ రూబెన్స్ తో జ‌రిపిన‌ ఇంట‌ర్వ్యూ విశేషాలు… 💐 నాగార్జున గారితో సినిమా చేయ‌డం మీకు ల‌క్కీనా. నాగ్ సార్‌కు ల‌క్కీనా? 👍ఇది టీమ్ వ‌ర్క్‌. ల‌క్ అనేది దైవ నిర్ణ‌యం. నాగార్జున గారితో సినిమా చేయ‌డం ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం క‌లుగుతుంది. ఆయ‌న‌తో నేనే కాదు ఎవ‌రు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్ర‌తీ టెక్నిషియ‌న్ ఫీలింగ్ ఇదే.…