‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్ చాలా స్ట్రెయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ మీడియాతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే… – ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే…