తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2015లో వచ్చిన చిత్రాల్లోంచి ‘రుద్రమ దేవి’, ‘కంచె’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో దర్శక, నిర్మాత గుణ శేఖర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అనుష్క శెట్టి, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద గుణ శేఖర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గద్దర్ అవార్డుల్ని ప్రకటించడంతో గుణ శేఖర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గుణ శేఖర్ మాట్లాడుతూ .. ‘‘2015వ సంవత్సరానికి గానూ గుణ టీం వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ సంయుక్తంగా నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఎంతో…