“1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి అవార్డు సినిమాల దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాతలు నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. .అతిధులగా పాల్గొన్న సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ…