స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ‘ఆయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే.. రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్. ‘ఆయ్’ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీమ్ వాళ్లు కోరారు. కానీ, నేను ఆయన్ను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్‌లో ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా…