అఖిల్ అక్కినేని ఈ మధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజర్‌లో అందర్ని ఆకట్టుకున్నాడు. ఈ ఒక్కమాటకి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్‌లర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మరో నిర్మాత వాసు వర్శతో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రీటజర్‌లో కెరీర్ సెట్ చేసుకున్నా, మ్యారీడ్ లైఫ్ మాత్రం…
Tag: allu aravind
అల్లు వారి ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభం
తెలుగు ప్రేక్షకులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య. హాస్యం ఆయన కేరాఫ్ ఆడ్రస్, హాస్యానికే ప్రాణం పోసిన బ్రహ్మ ఆయన.. అన్ని రసాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్రనైనా అలఓకగా చేసి చూపించిన గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా పరిశ్రమకి మార్గదర్శకుడయ్యాడు. ఆయన తెరపై కనిపిస్తే పాత్ర కనిపిస్తుందికాని ఆయన కనిపించరు. నటనకి నిలువెత్తు రూపం అల్లు రామలింగయ్య అంటే అతిశయోక్తికాదు. తెలుగు సినిమా చరిత్రలో గర్వించదగ్గ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామలింగయ్య పాత్రలు వుండటం విశేషం. హోమియోపతి డాక్టర్ గా పలు సేవాకార్యక్రమాలు అందించారు, తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా ఎంత బిజీగా వున్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు.…