ఘనంగా పద్మ విభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అనంతరం ఘనంగా సన్మానం.. మెమెంటో అందజేత సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నమణిమహేష్ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకున్న మణి తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం త్యాగరాయ గానసభలో అతిరథమహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పద్మవిభూషణ్ డా. అక్కినేని శతజయంతి వేడుకల కార్యక్రమంలో సీనియర్ సినీనటి మణిమహేష్ సీల్ వెల్ – శృతిలయ అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2024 అందుకున్నారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పుష్ప గుచ్చాలు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీనటి మణిమహేష్…