శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వాస్తవ పరిస్థితులని అద్దం పడుతూ, రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా, అందర్నీ ఆలోచింపజేసేలా ప్రజెంట్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా’ ‘ఏడాది కాకపోతే..…